Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ ను సమీక్షించనున్న సుప్రీంకోర్టు

  • ప్రాథమిక హక్కుల కోణంలో తాజా పిటిషన్
  • స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు
  • రాజ్యాంగ ధర్మాసనానికి పిటిషన్ నివేదన
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్ 377ను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2013 సంవత్సరంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. ఢిల్లీ హైకోర్టు నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నాడు పక్కన పెట్టేసింది.

అయితే, గోప్యత అన్నది ప్రాథమిక హక్కులో భాగమేనని ఇటీవలే ఆధార్ విషయంలో సుప్రీకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో... దీన్ని ఆధారంగా చేసుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ వర్గాలు (ఎల్జీబీటీక్యూ) తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులను చూసి భయపడాల్సి వస్తోందని వివరించాయి. స్వలింగ సంపర్కాన్ని నేరమంటున్న సెక్షన్ ను కొట్టేయాలని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.
gay
supreme court

More Telugu News