Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో భార‌త సంత‌తి న‌టుడి రికార్డు

  • కామెడీ టీవీ సిరీస్‌లో ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్న అజీజ్ అన్సారీ
  • ఈ అవార్డు అందుకున్న మొద‌టి ఆసియ‌న్ అమెరిక‌న్‌గా గుర్తింపు
  • 'మాస్ట‌ర్ ఆఫ్ న‌న్‌' షోలో న‌ట‌న‌కు గాను అవార్డు
అమెరికాలోని కాలిఫోర్నియాలో జ‌రిగిన ప్రతిష్ఠాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక‌లో భార‌త సంత‌తికి చెందిన న‌టుడు రికార్డు సృష్టించారు. కామెడీ టీవీ సిరీస్‌లో ఉత్త‌మ న‌టుడిగా అజీజ్ అన్సారీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొద‌టి ఆసియ‌న్ అమెరికన్ గా అన్సారీ నిలిచారు.

'మాస్ట‌ర్ ఆఫ్ న‌న్‌' అనే కామెడీ షోలో తన న‌ట‌న‌కు గాను అజీజ్ ఈ అవార్డు అందుకున్నారు. గ‌తంలో కూడా ఇదే షోలో న‌ట‌న‌కు అజీజ్ గోల్డెన్ గ్లోబ్ నామినేష‌న్ సంపాదించారు కానీ అవార్డు గెల‌వ‌లేక‌పోయారు.

 ఈ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలియ‌గానే త‌న‌కు ఆశ్చర్యానందాలు కలిగాయని అజీజ్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. అజీజ్ అన్సారీ త‌మిళ ముస్లిం కుటుంబానికి చెందిన‌వారు. వాయిస్ ఆర్టిస్ట్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా, న‌టుడిగా అజీజ్ అన్సారీ హాలీవుడ్‌లో రాణిస్తున్నారు.
aziz ansari
golden globes

More Telugu News