పవన్ కల్యాణ్ అనే వైరస్ ను సమాజం నుంచి తప్పించాలి: కత్తి మహేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ అనే వైరస్ ను సమాజం నుంచి తప్పించాలి: కత్తి మహేశ్

  • పవన్ కల్యాణ్ ని దేవుడిలా ఆరాధించే వాళ్లలో సమస్య ఉంది
  • ఆ ఫ్యాన్స్ ని సైకియాట్రిస్టుకు చూపించాలని వినతి
  • ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేశ్ 
రోడ్లపై కనబడితే కత్తి మహేశ్ ను కొడతామని హెచ్చరించిన పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షుడు రమేష్ వ్యాఖ్యలపై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ స్పందించారు. ‘ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు నేను చెప్పేదేమిటంటే.. మీ కొడుకో, కూతురో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే కనుక వాళ్లని తీసుకెళ్లి సైకియాట్రిస్టుకు చూపించండి.

పవన్ కల్యాణ్ లాంటి ఒక అస్థిత్వం, నిలకడ లేని మనిషిని, అసలు ఏ భావజాలంతో ఉన్నాడో అర్థం కాని మనిషిని .. కళ్లలోకి చూస్తూ మాట్లాడలేని మనిషిని, పదో తరగతి కూడా పాసు కాని ఒక వ్యక్తిని.. వీళ్లందరూ దేవుడని ఆరాధిస్తున్నారంటే వాళ్లలో తీవ్రమైన సమస్య నెలకొంది. పవన్ కల్యాణ్ అనే వైరస్ తో జాగ్రత్తగా ఉండాలి. సమాజం నుంచి తప్పించాలి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తూ, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. 
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News