ఐయాం రెడీ... వచ్చేశాను... ఎవరు వస్తారో చూస్తా: కత్తి మహేష్
- ప్రెస్ క్లబ్ కు వచ్చిన కత్తి మహేష్
- పావు గంట పాటు వేచి చూస్తానని వెల్లడి
- ఆ తరువాత తన వాదన వినిపిస్తానన్న కత్తి
మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని, ఎవరూ రాకుంటే, తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నాడు. తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పాడు. ఇదిలావుండగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి చేరుకున్న పవన్ కల్యాణ్ అభిమానులను ఎవరినీ గేటు దాటి లోనికి వచ్చేందుకు అనుమతించడం లేదు.