'మళ్లీ పెళ్లి' అంటూ సినిమాలో స్టిల్ పోస్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మళ్లీ పెళ్లి' అంటూ సినిమాలో స్టిల్ పోస్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి!

  • గతంలో సూపర్ హిట్ గా నిలిచిన 'జంబలకిడి పంబ'
  • రీమేక్ గా అదే టైటిల్ తో తెరపైకి
  • హైదరాబాద్ లో జరుగుతోన్న షూటింగ్        
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. తనదైన టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించడం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకత. తాజాగా ఆయన తాను మరో యువతి పూల దండలు మార్చుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి .. 'మళ్లీ పెళ్లి' అంటూ హెడ్డింగ్ పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మధ్యనే కదా రెండవ బిడ్డకు తండ్రి అయ్యాడు అనుకుంటూ అంతా ఆశ్చర్యపోయారు.

ఆ షాక్ లో నుంచి అందరినీ బయటికి తెస్తూ .. ఇది తన తాజా చిత్రం 'జంబలకిడి పంబ' సినిమాకి సంబంధించినది అంటూ శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చి ఘన విజయాన్ని సాధించిన 'జంబలకిడి పంబ'కు ఇది రీమేక్. అదే టైటిల్ తో ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను మళ్లీ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి జోడీగా సిద్ధి ఇద్నాని నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 'మను' దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
srinivas reddy
siddhi

More Telugu News