కేప్‌టౌన్ వీధుల్లో డ్యాన్స్ చేసిన అనుష్క శ‌ర్మ‌... వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేప్‌టౌన్ వీధుల్లో డ్యాన్స్ చేసిన అనుష్క శ‌ర్మ‌... వీడియో చూడండి

  • ఆల‌స్యంగా బ‌య‌టికి వ‌చ్చిన వీడియో
  • టెస్ట్ మ్యాచ్‌కి ముందు ద‌క్షిణాఫ్రికా వీధుల్లో విలాసాలు
  • ఇప్ప‌టికే వైర‌ల్ అయిన విరాట్‌, శిఖ‌ర్ ధావ‌న్‌ల డ్యాన్స్ వీడియో
న్యూఇయ‌ర్ వేడుక‌లు, రెండో హ‌నీమూన్‌, ద‌క్షిణాఫ్రికాతో మ్యాచులు అన్నీ క‌లిసొచ్చేలా విరాట్ - అనుష్క‌లు కేప్‌టౌన్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ణాళిక వేసుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా మ్యాచ్‌కి ముందు టీమిండియా బృందం, త‌మ కుటుంబాల‌తో క‌లిసి కేప్‌టౌన్ వీధుల్లో షాపింగ్‌లు, విలాసాలు చేశారు. అక్క‌డి ఓ వీధిలో విరాట్‌, శిఖ‌ర్ ధావ‌న్‌లు డ్యాన్స్‌ వేసిన వీడియో ఒక‌టి ఇప్ప‌టికే వైర‌ల్ అయింది.

తాజాగా అదే షికారులో భాగంగా అనుష్క శ‌ర్మ డ్యాన్స్ వేసిన వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. ఆల‌స్యంగా వ‌చ్చిన‌ప్ప‌టికి వైర‌ల్ అవ‌డంతో విరాట్‌, శిఖ‌ర్‌ల వీడియోను ఇది మించిపోతోంది. ఓ వ్య‌క్తితో పోటాపోటీగా అనుష్క డ్యాన్స్ చేస్తుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు.
Anushka Sharma
Virat Kohli
cape town

More Telugu News