నిహారిక తమిళ మూవీ ఆడియో ఫంక్షన్ మలేసియాలో!
- తెలుగులో 'ఒక మనసు' చేసిన నిహారిక
- తమిళంలో గౌతమ్ కార్తీక్ జోడీగా
- ఈ నెల చివరిలో విడుదల
అడ్వెంచర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి, ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. ఈ సినిమా ఆడియో వేడుక ఈ సాయంత్రం 6 గంటల నుంచి మలేసియాలో ఘనంగా మొదలుకానుంది. 'నడిగర సంఘం నైట్ ఇన్ మలేసియా' అనే కార్యక్రమంలో, అదే వేదికపై ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు.