ఉలిక్కిపడేలా చేసిన మెగా హీరో .. మల్టీ స్టారర్ మూవీలో ఆయన లేనట్టేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉలిక్కిపడేలా చేసిన మెగా హీరో .. మల్టీ స్టారర్ మూవీలో ఆయన లేనట్టేనా?

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • ఇది మల్టీ స్టారర్ మూవీ 
  • ఒక హీరోగా వెంకటేశ్ 
  • వరుణ్ తేజ్ మాటలతో అయోమయం   
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ - 2' అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో వెంకటేశ్ ఒక కథానాయకుడిగా చేయనుండగా, మరో హీరోగా వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా టాక్ వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 తాజాగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, 'తొలిప్రేమ' తరువాత తాను ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పాడు. ఏ ప్రాజెక్టును తాను ఓకే చేయలేదని అన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ఏదైనా ఓకే అనుకోగానే ముందుగా తానే చెబుతానని మరీ స్పష్టం చేశాడు. దాంతో ఇప్పటివరకూ ఈ సినిమాలో వరుణ్ తేజ్ చేస్తాడని అనుకున్న వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు .. అనిల్ రావిపూడి కలిసి వరుణ్ తేజ్ ను ఒప్పిస్తారా? లేదంటే మరో హీరోను చూసుకుంటారా? అనేది చూడాలి. 
venkatesh
varun tej

More Telugu News