రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదట.. కారణం చెప్పిన కర్ణాటక జ్యోతిష్కుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదట.. కారణం చెప్పిన కర్ణాటక జ్యోతిష్కుడు!

  • రజనీకాంత్‌ను ఎవరూ ఓడించలేరు
  • సీఎం అయ్యే చాన్స్ కూడా లేదు
  • కింగ్ మేకర్‌గా ఉంటారంతే..
  • జ్యోతిష్కుడు ప్రకాశ్ అమ్మునాయ్ స్పష్టీకరణ
రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాష్ట్రాన్ని పాలించే యోగం లేదట. ఈ మాటన్నది.. కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాశ్ అమ్మునాయ్. రజనీకాంత్ ‘కింగ్ మేకర్’గా ఉంటారు తప్పితే, ‘కింగ్’ అయ్యే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకు కారణాన్ని కూడా ఆయన వివరించారు.

రజనీకాంత్ మకరరాశిలో, సింహలగ్నంలో జన్మించారని పేర్కొన్న ఆయన ‘తలైవా’ను ఓడించడం ప్రత్యర్థులకు సాధ్యం కాదన్నారు. అయితే సన్నిహితుల కారణంగా ఆయనకు చెడు జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి సన్నిహితులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచనను మానుకుని మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడమే మేలని సూచించారు. పార్టీ నాయకుడిగా ఉంటూ ‘కింగ్ మేకర్’గా ఉండడమే బెటరని రజనీకాంత్‌కు ప్రకాశ్ సూచించారు.
Rajinikanth
Tamilnadu
Karnataka
CM

More Telugu News