ధ‌ర్నాకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స‌హా ఆందోళ‌న‌కారుల అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధ‌ర్నాకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స‌హా ఆందోళ‌న‌కారుల అరెస్టు

  • వ‌న‌ప‌ర్తి వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డు వ‌ద్ద ఉద్రిక్త‌త
  • వేరుశెన‌గ‌కు మ‌ద్ద‌తు ధర కోసం రైతుల ఆందోళన
  • ర‌హ‌దారిపై రైతుల ధ‌ర్నా
  • మద్దతు తెలిపిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వ‌న‌ప‌ర్తి వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డు వ‌ద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వేరుశెన‌గ‌కు మ‌ద్ద‌తు ధ‌ర లభించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర‌హ‌దారిపై రైతులంతా ధ‌ర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రెండు గంటలుగా వారు చేస్తోన్న ధర్నాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు ధ‌ర్నాకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అరెస్టు నేపథ్యంలో గందరగోళం నెలకొంది.
chinna reddy
arrest
vanaparthy

More Telugu News