అర్ధరాత్రి ఆఫీసులో ఫైళ్లను మాయం చేసే యత్నం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కలకలం!
- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
- సీఈవో నరసింహారావుపై అవినీతి ఆరోపణలు
- ఫైళ్లు తీసుకెళ్లకూడదని చెప్పిన మేకప్మేన్పై నరసింహారావు దాడి
- చాలా కాలంగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు
చానెల్ ముందు నిరసనకు దిగి తమ సీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. తమ సీఈవో పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ 30 తోనే ముగిసిందని, అయినప్పటికీ ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. కొత్త సీఈవో వస్తే తాను చేసిన అవినీతి బయటపడుతుందనే ఆయన ఫైళ్లను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్వీబీ చానెల్లో అవకతవకలు జరుగుతున్నట్లు చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ చానల్ నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా పలుసార్లు వార్తలు వచ్చాయి.