నా వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించండి: కోర్టులో లాలూ పిటిషన్

  • దాణా కుంభకోణం కేసులో దోషులకు కాసేపట్లో శిక్ష ఖరారు
  • నాకు ఈ కుంభకోణంలో ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదు-లాలూ
  • లాలూ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందోనని ఆసక్తి
దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేయనున్న విషయం తెలిసిందే. కాగా, ఆర్జేడీ అధినేత, దోషి లాలూ ప్రసాద్ యాదవ్ వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, తన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించాలని లాలూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.  
Go Back to Shorts
lalu prasad yadav
quantum of sentence
ranchi

More Telugu News