తదుప‌రి చిత్రానికి రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్న ఐశ్వ‌ర్య రాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తదుప‌రి చిత్రానికి రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్న ఐశ్వ‌ర్య రాయ్

  • ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న ఐష్‌
  • 'రాత్ ఔర్ దిన్' సినిమాకు రీమేక్‌
  • ఆ సినిమాలో హీరోయిన్ న‌ర్గీస్ ద‌త్‌
పెళ్లి, ఆరాధ్య జ‌న‌నం త‌ర్వాత బాలీవుడ్ నటి ఐశ్వ‌ర్య రాయ్ న‌టించిన సినిమాలు త‌క్కువే. కానీ ఆమె డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న 'ఫ్యానీ ఖాన్' చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆమె త‌దుప‌రి చిత్రాన్ని కూడా 'ఫ్యానీ ఖాన్' నిర్మాత ప్రేర‌ణ అరోరా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఐశ్వ‌ర్య రాయ్ రూ. 10 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

1967లో న‌ర్గీస్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన 'రాత్ ఔర్ దిన్‌' సినిమాకు ఇది రీమేక్‌. ఇందులో న‌టించ‌డానికి ఐశ్వ‌ర్య రాయ్ రూ. 10 కోట్లు అడిగింద‌ని మిడ్‌నైట్ న్యూస్ ప‌త్రిక పేర్కొంది. ఆమె డిమాండ్‌ను నిర్మాత‌లు వెంట‌నే అంగీక‌రించార‌ని కూడా వెల్ల‌డించింది. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాయ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న కార‌ణంగా ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు మారు మాట్లాడ‌కుండా నిర్మాత‌లు అంగీక‌రించినట్లు స‌మాచారం.
Aishwarya Rai
raat aur din
fanney khan

More Telugu News