2017లో సీఈఓ టిమ్ కుక్ కంటే ఎక్కువ సంపాదించిన ఆపిల్ ఉద్యోగి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2017లో సీఈఓ టిమ్ కుక్ కంటే ఎక్కువ సంపాదించిన ఆపిల్ ఉద్యోగి!

  • టిమ్ సంపాద‌న రూ. 81.5 కోట్లు
  • ఏంజెలా రెండ్స్ సంపాద‌న రూ. 154.09 కోట్లు
  • రిటైల్ విభాగంలో ప‌నిచేస్తున్న‌ ఏంజెలా
సాధార‌ణంగా ఏ ఆఫీసులోనైనా ఉద్యోగుల సంపాద‌న కంటే సీఈఓ సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంది. కానీ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2017లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కంటే ఆ సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగి దాదాపు రెట్టింపు సంపాదించారు. ఆమె పేరు ఏంజెలా రెండ్స్. ఆపిల్ సంస్థ‌లో రిటైల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తోంది.

ఆపిల్ సంస్థ అకౌంట్ లెక్క‌ల ప్ర‌కారం.. 2017లో టిమ్ కుక్ రూ. 81.5 కోట్లు వేత‌నంగా పొంద‌గా, ఏంజెలా రెండ్స్ రూ. 154.09 కోట్లు పొందారు.  జీతం విష‌యంలో ఏంజెలా, టిమ్ కుక్‌ల మ‌ధ్య చాలా తేడా ఉంది. అయిన‌ప్ప‌టికీ సీఈఓకి లేని అద‌న‌పు స‌దుపాయాలు ఏంజెలాకి ఉండ‌టంతో ఇంత సంపాద‌న సాధ్య‌మైంది. అంతేకాకుండా టిమ్ కుక్‌కి చెల్లించాల్సిన వాటిలో స్టాక్ అవార్డుల‌ను గ‌ణించ‌క‌పోవ‌డంతో ఏంజెలా సంపాద‌న ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.
tim cook
apple
ceo
angela

More Telugu News