Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న మాధ‌వ‌న్‌!

  • 'బ్రీత్‌' పేరుతో త్వ‌ర‌లో రానున్న వెబ్‌సిరీస్ 
  • కొడుకును కాపాడుకునే తండ్రి పాత్ర‌లో మాధ‌వ‌న్‌
  • హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌
ఇంట‌ర్నెట్ స్ట్రీమింగ్ వీడియోల‌కు రోజురోజుకీ ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో అగ్ర‌తార‌లు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే 'సోష‌ల్‌' అనే వెబ్‌సిరీస్‌లో రానా న‌టించారు. అలాగే హిందీలో కూడా వివేక్ ఒబెరాయ్‌, రిచా చ‌ద్దా, రాజ్‌కుమార్ రావ్ వంటి తార‌లంద‌రూ వెబ్ సిరీసుల్లో కనిపించిన సంగ‌తి తెలిసిందే. ఇదే కోవలో, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మంచి న‌టుడుగా పేరు తెచ్చుకున్న ఆర్‌.మాధ‌వ‌న్ త్వ‌ర‌లో ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బ్రీత్‌' అనే పేరుతో జ‌న‌వ‌రి 26 నుంచి ఈ వెబ్‌సిరీస్ ప్ర‌సారం కానుంది. ఇందులో కొడుకును కాపాడుకునే తండ్రి పాత్రలో మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడు. దీనికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. కొడుకు బ‌త‌కాలంటే తండ్రి చావాలి... తండ్రి బ‌త‌కాలంటే కొడుకు చావాలి.. అనే ప‌రిస్థితుల్లో తండ్రి తీసుకున్న నిర్ణ‌యం ఏంట‌నే ఆసక్తిక‌ర అంశాన్ని టీజ‌ర్‌లో చూపించి ఆస‌క్తి క‌లిగించారు. ఈ సిరీస్ తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌సారం కానుంది.

madhavan
breathe
web series
amazon prime

More Telugu News