నేరాలకు పాల్పడుతున్న యువతిని కాల్చి చంపుతున్న అమెరికా పోలీసులు... వీడియో విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేరాలకు పాల్పడుతున్న యువతిని కాల్చి చంపుతున్న అమెరికా పోలీసులు... వీడియో విడుదల!

  • నేరాలకు పాల్పడుతున్న సియారా హోవార్డ్
  • అరెస్ట్ చేసేందుకు వెళ్లిన కెన్సాస్ పోలీసులు
  • గన్ తో హల్ చల్ చేసిన యువతి
  • కాల్చి చంపిన పోలీసులు
చేతిలో తుపాకీ పట్టుకుని హల్ చల్ చేస్తున్న ఓ యువతిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. పోలీసుల యూనిఫామ్ కు ఉన్న కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ వీడియో విడుదలైంది. కెన్సాస్ లో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. సియారా హోవార్డ్ అనే మహిళ, పదే పదే నేరాలకు పాల్పడుతూ నిబంధనలను అతిక్రమిస్తుండటంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు.

ఆ సమయంలో తన ఇంట్లోనే ఉన్న ఆమె, ఎంతకీ తలుపులు తీయలేదు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన అనంతరం పోలీసులు తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి చేతిలో తుపాకితో ఆమె కనిపించింది. తుపాకీనీ కింద పడేయాలని పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా వారిపై కేకలు వేస్తూ దూషించింది. చివరకు పోలీసులు ఆమెను కాల్చి చంపారు.

Gun
Kansas
USA

More Telugu News