అక్కినేని కుటుంబానికి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!
- ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ కోల్పోయిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్
- ఆదాయ వివరాలను అందించని ఫౌండేషన్
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
తెలంగాణకు చెందిన 190, ఏపీకి చెందిన 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్టులో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది. ఎఫ్సీఆర్ఏ లేని ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలను పొందలేవు.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను 2005లో అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, కుటుంబ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.