డిస్కవర్ బ్రాండ్ పై బజాజ్ నుంచి మరో కొత్త మోడల్... ముహూర్తం ఈ నెల 10
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిస్కవర్ బ్రాండ్ పై బజాజ్ నుంచి మరో కొత్త మోడల్... ముహూర్తం ఈ నెల 10

  • 110 సీసీ మోడల్ ఆవిష్కరణ
  • ప్రారంభ స్థాయిలో మార్కెట్ వాటా పెంచుకునే లక్ష్యం
  • రూ.46,000-48,000 మధ్యలో ధర
తనకు బాగా అచ్చొచ్చిన డిస్కవర్ శ్రేణిలో బజాజ్ ఆటో మరో బైక్ ను ఈ నెల 10న విడుదల చేయనుంది. బజాజ్ డిస్కవర్ కింద ప్రస్తుతం 125సీసీతో ఒక మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి అదనంగా 110సీసీ సామర్థ్యంతో ఓ నూతన మోడల్ ను బజాజ్ ఆవిష్కరించనుంది. బడ్జెట్ కేటగిరీలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలన్న వ్యూహంతోనే బజాజ్ ఆటో దీన్ని తీసుకొస్తోంది. దీని ధర రూ.46,000-48,000 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దేశీ టూవీలర్స్ మార్కెట్లో ప్రారంభ స్థాయి మోటార్ సైకిళ్ల వాటా ఇప్పటికీ 60 శాతంతో ఉంది. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ డేటా ప్రకారం హీరో మోటో కార్ప్ 110 సీసీ వరకు వాహనాల మార్కెట్లో 74 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత బజాజ్ ఆటో 13 శాతం, హోండా మోటార్ సైకిల్ 8 శాతం వాటా కలిగి ఉన్నాయి. బజాజ్ గతంలో డిస్కవర్ బ్రాండ్ కింద 100సీసీ, 110ఎం, 125 ఎం, 125ఎస్ టీ మోడళ్లను విక్రయించింది. అలాగే, 150ఎఫ్, 150ఎస్ మోడళ్లను కూడా కొంత కాలం పాటు అందుబాటులో ఉంచి ఆ తర్వాత వాటిని నిలిపివేసింది.
bajaj discover
110cc
bikes

More Telugu News