కమ్ముకున్న పొగమంచు.. చుట్టూ జనాలున్నా ఏమీ కనిపించని వైనం.. యువతిపై అఘాయిత్యం చేసిన కామాంధుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమ్ముకున్న పొగమంచు.. చుట్టూ జనాలున్నా ఏమీ కనిపించని వైనం.. యువతిపై అఘాయిత్యం చేసిన కామాంధుడు!

  • పొగమంచును అనుకూలంగా చేసుకున్న నిందితుడు
  • చండీగఢ్ లో ఘటన
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
దట్టంగా కమ్ముకున్న పొగమంచు, చుట్టూ జనాలున్నా, ఎవరికీ ఏమీ కనిపించని పరిస్థితి. దాన్నే అలుసుగా తీసుకున్న ఓ కామాంధుడు, తన కంటికి కనిపించిన ఓ యువతిని బలాత్కరించాడు. ఈ ఘటన గత నాలుగు రోజులగా భారీగా పొగమంచు కురుస్తున్న చండీగఢ్ లో జరిగింది. చుట్టూ ఏమీ కనిపించని విధంగా పొగమంచు కమ్మేయడంతో ఇదే అదనుగా భావించిన ఓ యువకుడు, నయాగావ్ ప్రాంతంలో ఓ షాపులో పని చేసి ఇంటికి వస్తున్న యువతిపై అత్యాచారం చేశాడు.

చంపుతానని బెదిరించడంతో పాటు, గతంలో ఓ హత్య కూడా చేశానని చెప్పిన సదరు యువకుడి బలం ముందు బాధితురాలు ఏమీ చేయలేకపోయింది. చుట్టూ పొగమంచు కమ్మేసి ఉండటంతో జనాలు తిరుగుతున్నా ఆమెకు సాయం అందలేదని తెలుస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా, అత్యాచారం జరిగినట్టు నివేదిక వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Chandighat
Fog
Rape

More Telugu News