అడిగిన వెంటనే బిర్యానీ ఇవ్వలేదని కత్తులతో దాడి.. హైదరాబాదులో హోటల్ ధ్వంసం!
- కార్పొరేటర్ అనుచరులమంటూ దాడి
- కత్తులు, కర్రలతో బీభత్సం
- పోలీసులకు ఫిర్యాదు.. పరారీలో నిందితులు
‘మేం స్థానిక కార్పొరేటర్ అనుచరులం. మాకే బిర్యానీ లేదంటావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలీ రజాపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. అరగంటపాటు హోటల్లో బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.