స్మార్ట్‌ఫోన్ చూస్తూ న‌డిచిన యువతి.. లిఫ్టులో కాలు ఇరుక్కుపోయి ఛిద్ర‌మైన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మార్ట్‌ఫోన్ చూస్తూ న‌డిచిన యువతి.. లిఫ్టులో కాలు ఇరుక్కుపోయి ఛిద్ర‌మైన వైనం!

  • చైనాలోని షాంఘైలో ఘటన
  • లిఫ్టు డోర్ల మ‌ధ్య ఇరుక్కుపోయిన కాలు 
  • సీసీ కెమెరాలో రికార్డు
స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ న‌డుస్తోన్న ఓ యువ‌తి ప్ర‌మాదానికి గురైన‌ ఘ‌ట‌న చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు కంపెనీలో ఆ యువ‌తి ప‌నిచేస్తోంది. త‌న ప‌ని ముగించుకున్నాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌ దగ్గరకు వచ్చింది. అదే స‌మ‌యంలో స్మార్ట్‌పోన్‌ను చూస్తూ లిఫ్టులో అడుగుపెట్టింది. ఈ క్ర‌మంలో ఆమె కాలు.. రెండు లిఫ్టు డోర్ల మ‌ధ్య ఇరుక్కుపోయింది. ఒక్క‌సారిగా లిఫ్ట్‌ కదిలి వెళ్ల‌డంతో ఆమె కాలు ఛిద్రమైపోయింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. స్మార్ట్‌ఫోన్లు చూస్తూ న‌డుస్తూ చాలా మంది ప్ర‌మాదాల‌కు గుర‌వుతోన్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్న‌ప్ప‌టికీ స్మార్ట్‌ఫోన్ ప్రియులు త‌మ అల‌వాట్లను మానుకోవ‌డం లేదు. దీంతో ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు.
   
smart phone
china
girl

More Telugu News