గ‌జ‌ల్ శ్రీనివాస్‌కి బెయిల్ ఇవ్వొద్దు: కోర్టులో పోలీసుల కౌంట‌ర్ పిటిష‌న్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ‌జ‌ల్ శ్రీనివాస్‌కి బెయిల్ ఇవ్వొద్దు: కోర్టులో పోలీసుల కౌంట‌ర్ పిటిష‌న్

  • ఓ యువ‌తిపై గ‌జ‌ల్ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసు
  • బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన గ‌జ‌ల్ శ్రీనివాస్
  • బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల‌ను తారుమారు చేసే అవ‌కాశం ఉంది-పోలీసులు
  • తీర్పు రేప‌టికి వాయిదా
ఓ యువ‌తిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం చంచ‌ల్ గూడ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నాంప‌ల్లి కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే, ఆయ‌న‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల‌ను తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అలాగే పోలీసులు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను ఏడు రోజుల క‌స్ట‌డీకి కోరారు. ఇరు పక్షాల న్యాయ‌వాదుల వాద‌న‌లు విన్న కోర్టు ఈ పిటిష‌న్‌ల‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు ఈ కేసులో మ‌రిన్ని సాక్ష్యాల కోసం ఆరా తీస్తున్నారు.
gazal srinivas
Police
bail

More Telugu News