బిట్ కాయిన్ కు మళ్లీ రెక్కలు... ఈ రోజు 10 శాతం అప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిట్ కాయిన్ కు మళ్లీ రెక్కలు... ఈ రోజు 10 శాతం అప్

  • పేపాల్ వ్యవస్థాపకుడు థిల్ పెట్టుబడులు
  • బయటపెట్టిన వాల్ స్ట్రీట్ జర్నల్
  • దీంతో బిట్ కాయిన్లకు మళ్లీ డిమాండ్
క్రిప్టోకరెన్సీ అలియాస్ డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ధర మరోసారి ఎగిసింది. ఈ నెల 1న ఒక్క బిట్ కాయిన్ ధర 13,354 డాలర్లు కాగా, ఈ రోజు 14,951 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థిల్ పెద్ద మొత్తంలో బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొనడమే తాజా ర్యాలీకి కారణం.

పీటర్ థిల్ 2 కోట్ల డాలర్ల మేర బిట్ కాయిన్లు కొన్నట్టు వాల్ స్ట్రీట్ కథనం. అంతేకాదు, వీరు కొనుగోలు చేసిన తర్వాత బిట్ కాయిన్ ధర ఐదు రెట్లు పెరిగినట్టు ఈ కథనం పేర్కొంది. గతేడాది బిట్ కాయిన్ ధర మొత్తం మీద 13 రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. కాగా, బిట్ కాయిన్ గత డిసెంబర్ 17న నమోదు చేసిన 19,666 డాలర్ల గరిష్ట స్థాయిని మరోసారి చేరుతుందని రాయిటర్స్ అంచనా.
bitcoin price

More Telugu News