కొత్త సంవత్సరం రోజు పుట్టిన పాపకు డిగ్రీ వరకు ఉచిత విద్య
- ప్రకటించిన బెంగళూరు నగరపాలక సంస్థ
- రాజాజీ నగర్ ప్రజాసుపత్రిలో జన్మించిన పాప
- అర్థరాత్రి 00:05 గంటలకు జననం
అర్థరాత్రి 00:05 గంటలకు పుష్ప, గోపీ దంపతులకు ఈ పాప జన్మించింది. ఈ పథకం ద్వారా తమ కూతురు చదువుకు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి బీబీఎంపీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ డెలివరీ ద్వారా, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు చేయించుకున్నవారే ఇందుకు అర్హులని గతంలో మేయర్ సంపత్ రాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.