'నా పేరు సూర్య'పై హల్ చల్ చేస్తోన్న రూమర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా పేరు సూర్య'పై హల్ చల్ చేస్తోన్న రూమర్!

  • అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'నా పేరు సూర్య' 
  • ఆర్మీ ఆఫీసర్ గా ఆయన పాత్ర
  • 'ఆగ్రహం'లో రాజశేఖర్ పాత్రను పోలి ఉందంటూ టాక్  
అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫస్టు ఇంపాక్ట్ బయటికి వచ్చిన తర్వాత, ఈ సినిమాకి సంబంధించిన రూమర్ ఒకటి ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.

చాలా కాలం క్రితం రాజశేఖర్ చేసిన 'ఆగ్రహం' సినిమాలో, ఆయన పాత్రను పోలినదిగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కనిపిస్తోందని అంటున్నారు. 'ఆగ్రహం' సినిమాలో ఆర్మీ మేన్ అయిన రాజశేఖర్, సెలవులపై ఇంటికి వస్తాడు. సమాజంలో జరుగుతోన్న కొన్ని అక్రమాల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు ..తన కళ్ల ముందు ఎవరు ఎలాంటి తప్పు చేస్తున్నా తనదైన శైలిలో ప్రశ్నిస్తాడు. 'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా అదే తరహాలో కనిపిస్తోందని అంటున్నారు. కథా కథనాల పరంగా ఆ సినిమాకీ .. ఈ సినిమాకి సంబంధం లేకపోయినప్పటికీ, హీరో పాత్ర స్వభావం గురించే ఇలా చెప్పుకుంటున్నారు.           
allu arjun
anu

More Telugu News