'ఐశ్వర్యా రాయ్ నా కన్నతల్లి' అంటూ వచ్చిన విశాఖ కుర్రాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఐశ్వర్యా రాయ్ నా కన్నతల్లి' అంటూ వచ్చిన విశాఖ కుర్రాడు!

  • సంచలన ఆరోపణలు చేసిన సంగీత్ కుమార్
  • 1988లో జన్మించానని చెప్పుకున్న విశాఖ యువకుడు
  • నిరూపించే ఆధారాలు మాత్రం లేవట!
అందాల నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ తన కన్నతల్లి అంటూ విశాఖకు చెందిన సంగీత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ యువకుడి వయసు 29 సంవత్సరాలు కావడంతో అతని వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాను ఐవీఎప్ విధానం ద్వారా ఐశ్వర్యకు 1988లో జన్మించానని ఈ వీడియోలో సంగీత్ కుమార్ చెప్పుకున్నాడు. లండన్ లో తాను జన్మించానని, తన తండ్రి పేరు అడివేలు రెడ్డి అని చెప్పాడు.

చిన్నప్పుడు ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్ రాయ్, వ్రిందా రాయ్ లు తనను రెండేళ్లు పెంచారని, ఆపై అడివేలు రెడ్డి, తనను విశాఖకు తీసుకు వచ్చాడని అంటున్నాడు. తనకిప్పుడు తల్లితో ఉండాలని ఉందని, ఆమే తన తల్లి అని నిరూపించే ఆధారాలు ఏవీ తనవద్ద లేదని చెబుతున్నాడు. ఇక ఈ సంగీత్ కుమార్ వ్యాఖ్యలపై ఐష్ స్పందిస్తుందో లేక నవ్వుకుని ఊరుకుంటుందో!
Aishwarya Rai
Vishakhapatnam
Sangeet Kumar

More Telugu News