Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2017లో ఒబామాకు న‌చ్చిన పుస్త‌కాలు, పాట‌లు ఇవే!

  • ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్ల‌డించిన అమెరికా మాజీ అధ్య‌క్షుడు
  • అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టి సంప్ర‌దాయాన్ని కొన‌సాగించిన ఒబామా
  • క‌ళాకారుల‌కు ప్రోత్సాహం కోసమేన‌ని వ్యాఖ్య‌
తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు పాటించిన సంప్ర‌దాయాన్ని తిరిగి కొన‌సాగించారు అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా. ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అంత‌కుముందు ఏడాది తాను చ‌దివిన పుస్త‌కాలు, విన్న సంగీతంలో త‌న‌ను బాగా ఆకట్టుకున్న వాటి జాబితాను ఒబామా వెల్ల‌డించారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా 2017లో త‌న‌ను ఆక‌ట్టుకున్న పుస్త‌కాలు, పాట‌ల జాబితాను ఒబామా పంచుకున్నారు.

పుస్త‌కాలు రాసిన ర‌చ‌యిత‌లు, పాట‌లు పాడిన క‌ళాకారుల‌కు ప్రోత్సాహం ఇవ్వ‌డానికి ఇలాంటి పోస్టుల‌ను ఒబామా పెడుతుంటారు. గ‌తేడాది ఒబామా చ‌దివిన ఉత్త‌మ పుస్త‌కాల జాబితాలో న‌యోమి ఆల్డ‌ర్‌మ‌న్ రాసిన ద ప‌వ‌ర్‌, జేమ్స్ మెక్ బ్రెయిడ్ రాసిన ఫైవ్ కేరెట్ సోల్ వంటి పుస్త‌కాలు ఉన్నాయి. ఇక పాట‌ల్లో మి జెంటే, రైజ్ అప్ వంటి హిట్ పాట‌లు ఉన్నాయి.
obama
ex president
list
songs
books

More Telugu News