క‌ష్ట‌ప‌డుతూ వంట చేస్తున్న స‌చిన్‌.. స్నేహితుల కోస‌మే ఇదంతా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌ష్ట‌ప‌డుతూ వంట చేస్తున్న స‌చిన్‌.. స్నేహితుల కోస‌మే ఇదంతా!

  • వంట చేస్తున్న వీడియోను ట్వీట్ చేసిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
  • న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగా వంట చేసిపెట్టిన స‌చిన్‌
  • ఆక‌ట్టుకుంటున్న వీడియో
క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న స‌మ‌యాన్ని కుటుంబంతో, స్నేహితుల‌తో గ‌డ‌పడానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలు, వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల న్యూఇయ‌ర్ వేడుక‌లను కూడా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో స‌చిన్ జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి కోసం వంట‌కాలు చేసి పెట్టాడు స‌చిన్‌. తాను వంట చేస్తున్న వీడియోను స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

నిప్పుల మీద చికెన్ వేస్తూ, అప్పుడు వ‌స్తున్న పొగ‌కు ఇబ్బంది ప‌డుతూ సచిన్ వంట చేస్తుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వంట చాలా బాగా కుదిరింద‌ని, స్నేహితులు చాలా ఇష్టంగా తిన్నార‌ని స‌చిన్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అలాగే అభిమానులంద‌రికీ న్యూఇయ‌ర్ విషెస్ కూడా తెలిపారు.
sports
Sachin Tendulkar
chef

More Telugu News