గాడిదలకు ఫుల్ డిమాండ్.. లక్షాధికారులు అయిపోవచ్చు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాడిదలకు ఫుల్ డిమాండ్.. లక్షాధికారులు అయిపోవచ్చు!

  • చైనాలో తగ్గిన గాడిదల సంఖ్య
  • ఒక్కో గాడిద తోలు రూ. 30 వేలు
  • దిగుమతులపై సుంకాన్ని తగ్గించిన చైనా
ప్రపంచ దేశాలను తన వస్తువులతో ముంచెత్తుతున్న చైనాకు... ఓ విషయంలో మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. అదేంటో కాదు గాడిద తోలు! చైనాలో గాడిదల సంఖ్య భారీగా తగ్గింది. తీంతో ఇతర దేశాల్లోని గాడిద తోలు విక్రయదారులను ఆకర్షించేందుకు వాటిపై సుంకాన్ని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనాలో గాడిద తోలుకు భారీ రేటు పలుకుతోంది. ఒక్కో గాడిద తోలును మన కరెన్సీలో దాదాపు రూ. 30 వేలకు కొంటున్నారు.

గాడిద తోలు నుంచి తీసే జెలిటిన్ కు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. తోలు చర్మకండరాల నుంచి కాచి తీసిన రుచిలేని జిగురు పదార్థమే ఈ జెలిటిన్. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ చైనా ఔషధాల్లో వాడతారు. అంతేకాదు, గాడిద మాంసాన్ని చైనాలోని అనేక ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. మరోపైపు, చైనా దెబ్బకు తమ దేశంలోని గాడిదలు మాయమయ్యే అవకాశం ఉందని ఇతర దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
donkey
demand for donkeys
china donkeys

More Telugu News