అలా టీడీపీలోకి వెళ్లి.. ఇలా తిరిగి సొంత గూటికి గుడివాడ వైకాపా నేత!
- ఇటీవల దేవినేని సమక్షంలో టీడీపీలో చేరిన రవికాంత్
- తిరిగి వైకాపాలోకి గుడివాడ నేత
- ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు
తెలుగుదేశం నేతలు కుట్రలు, బెదిరింపులకు పాల్పడి తనను ఆ పార్టీలోకి తీసుకు వెళ్లారని ఆరోపించారు. అతి త్వరలో వారు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా మీడియాకు అందిస్తానని చెప్పారు. ఇదే సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ, వైకాపా నేతలను ప్రలోభ పెట్టి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని, అవి కొనసాగితే, ఇటువంటి సంఘటనలే ఎదురవుతాయని హెచ్చరించారు.