బెంగళూరులో సేమ్ సీన్... అమ్మాయిలను నానాయాగీ చేసిన యువకులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరులో సేమ్ సీన్... అమ్మాయిలను నానాయాగీ చేసిన యువకులు!

  • బ్రిగేడ్ రోడ్డులో రెచ్చిపోయిన యువకులు
  • యువతుల దుస్తులు లాగివేసే ప్రయత్నం
  • కావాలనే మీద పడుతూ వేధింపులు
  • తమ అనుభవాన్ని చెప్పుకున్న జంట
బెంగళూరు వీధుల్లో డిసెంబర్ 31, 2016 రిపీటైంది. పోలీసులు ఎంతగా కఠిన నిబంధనలు అమలు చేసినా, బ్రిగేడ్ రోడ్ తదితర ప్రాంతాల్లో అల్లరి యువకులు రెచ్చిపోయారు. కనిపించిన అమ్మాయినల్లా వేధించారు. వారి దుస్తుల్లో చేతులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఓ దంపతుల జంట తమకు ఎదురైన అనుభవాన్ని 'ఇండియా టుడే'కు వివరిస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని తామిద్దరమూ రోడ్డుపైకి వెళ్లామని, అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు తన భార్యను వేధించారని చెప్పారు.

 సరిగ్గా సమయం 12 కొట్టగానే, రోడ్డుపైకి వచ్చిన యువకుల సంఖ్య పెరిగిపోయిందని, కావాలనే అమ్మాయిల మీద పడటానికి పలువురు ప్రయత్నించారని, యువతుల దుస్తులను లాగివేసే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడ ఉన్నా, వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారని, తమ జంటను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించారని, జరిగిన విషయాన్ని తాను ఫిర్యాదు చేయనున్నానని చెప్పారు. గత సంవత్సరం ఇదే బ్రిగేడ్ రోడ్డుతో పాటు ఎంజీ రోడ్డు తదితర ప్రాంతాల్లో అల్లరి యువకులు ఎంతో మందిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఎవరైనా రెచ్చిపోతే కనుక తాట తీస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేసినా, వేధింపుల ఘటనలు వెలుగుచూడటం గమనార్హం.
Bengalore
New Year
2018

More Telugu News