థాయిలాండ్ లో భారత్, పాక్ మధ్య రహస్య చర్చలు!
- డిసెంబర్ 27న రహస్య భేటీ
- పాల్గొన్న అజిత్ ధోవల్, నాజర్ ఖాన్
- వివిధ అంశాలపై చర్చలు
- ప్రత్యేక కథనంలో 'ది డాన్'
కాగా, పాక్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ ను ఆయన కుటుంబ సభ్యులు కలసి వచ్చిన రెండు రోజుల తరువాత ఈ సమావేశం జరగడం గమనార్హం. జాదవ్ భార్య, తల్లిని అవమానించేలా పాక్ అధికారులు ప్రవర్తించిన తీరుపైనా ధోవల్ ఈ సమావేశంలో తన అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంపై భారత్ అధికారికంగా ఇంతవరకూ నోరు విప్పలేదు. ఇదిలావుండగా, దాదాపు 30 సంవత్సరాల క్రితం కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా, న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాలు సోమవారం నాడు తమ తమ దేశాల్లోని అణు కేంద్రాల జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయి.