కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్న పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్న పవన్ కల్యాణ్

  • మొద‌టిసారి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన ప‌వ‌న్‌
  • నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పనున్నట్లు స‌మాచారం
  • అంత‌కు ముందు కేసీఆర్‌ను క‌లిసిన ప‌లువురు మంత్రులు
జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని ముఖ్య‌మంత్రి నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వ‌చ్చారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసి, కాసేపు ముచ్చ‌టించనున్నారు. కేసీఆర్‌కి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపి ప‌లు అంశాల‌పై మాట్లాడనున్నట్లు స‌మాచారం. ఈ విష‌యంపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టిసారి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. అంతకు ముందు కేసీఆర్‌ను ప‌లువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపి వెళ్లారు.         
Pawan Kalyan
Telangana
KCR

More Telugu News