ఫీల్‌ అవడం లేదని మాత్రం అబద్ధం చెప్పను!: భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫీల్‌ అవడం లేదని మాత్రం అబద్ధం చెప్పను!: భూమిక

  • ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన భూమిక 
  • 'ఎంసిఏ'లో హీరోకి అక్క పాత్ర     
  • ఇది పురుషాధిక్య ప్రపంచమన్న భూమిక
ఖుషీ, ఒక్కడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో అగ్ర హీరోయిన్‌లలో ఒక్కరిగా నిలిచిన భూమిక తాజాగా ‘ఎంసీఏ’ సినిమాలో నేచురల్ స్టార్ నానికి వదినగా నటించి అదుర్స్ అనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. 'మీరు ఎవరి పక్కన హీరోయిన్‌గా నటించారో వాళ్లు ఇంకా హీరోలుగా చేస్తోంటే.. మీరు వదిన, అక్క పాత్రలు చేస్తున్నారు. ఎలా ఫీల్‌ అవుతున్నారు?' అని అడగగా భూమిక స‌మాధానం చెబుతూ.. ఫీల్‌ అవడం లేదంటూ అస‌త్యం చెప్పబోన‌ని చెప్పారు.

ఇది పురుషాధిక్య ప్రపంచమ‌ని, స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని భూమిక తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఇటువంటి ప‌రిస్థితి ఇలానే కొనసాగుతోందని తెలిపారు. ‘యే దిల్‌హై ముష్కిల్‌’ సినిమాలో 43 ఏళ్ల ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటిస్తే ఆమె కన్నా వయసులో చిన్న అయిన న‌టుడు హీరోగా చేశాడ‌ని తెలిపారు. ఇటువంటి విభిన్నమైన కథలు సిద్ధం చేయాలని, సినీ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అనుకుంటే మార్పు సాధ్యం అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు.  

bhoomika
mca
cinema

More Telugu News