'టైగర్ జిందా హై' సినిమాతో ప్రధాని మోదీకి సంబంధం?
- వెల్లడించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్
- 2014లో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కథాంశానికి మూలం
- ఆ మిషన్ నడిపించింది మోదీ?
మోదీ అధికారంలోకి వచ్చాక కొన్ని రోజుల్లోనే ఈ మిషన్ ప్రారంభమైంది. ఆ మిషన్ ఆదర్శంగా తీసుకుని, మోదీ పాలనా చాకచక్యాన్ని గుర్తిస్తూ ఈ సినిమాను ఆయనకు అంకితం చేస్తున్నట్లు అలీ అబ్బాస్ జాఫర్ తెలిపారు. నిజానికి ఈ సినిమాలో ఒకానొక చోట మోదీ పేరు ప్రస్తావన కూడా తీసుకువచ్చారట. కానీ సీబీఎఫ్సీ అంగీకరించకపోవడంతో ఆ మాటలు మార్చినట్లు జాఫర్ చెప్పారు.