డ్రంకెన్ డ్రైవ్ వద్దంటూ సల్మాన్ ఫొటోతో పోలీసుల ట్వీట్.. వైరల్!
Add ap7am to your home Screen

డ్రంకెన్ డ్రైవ్ వద్దంటూ సల్మాన్ ఫొటోతో పోలీసుల ట్వీట్.. వైరల్!

  • యూపీ పోలీసుల వినూత్న ప్రచారం
  • కండల వీరుడి ఫొటోతో తాగొద్దంటూ ట్వీట్
  • క్షణాల్లోనే వైరల్
కొత్త సంవత్సరం వేళ యూపీ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ జోష్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లు వద్దంటూ ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసిన పోలీసులు అందుకోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫొటో వాడడం సంచలనంగా మారింది. సల్మాన్ నటించిన ‘దబాంగ్’ సినిమాలోని చుల్‌బుల్ పాండే ఫొటోతో ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని ట్వీట్ చేశారు. ఆ సినిమాలోని ఓ డైలాగ్‌ను మార్చి దానికి ‘జర సంభాల్‌కే’ అని ట్వీట్ చేశారు. గతంలో సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపి పలువురి మృతికి కారణమైనట్టు ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఫొటోను వాడుకుని వాహనదారులను హెచ్చరించడం వైరల్ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కాగా, యూపీ వ్యాప్తంగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ డ్రంకెన్ డ్రైవ్‌లు మాత్రం ఆగలేదు. తనిఖీల్లో పలువురు ప్రముఖులు సహా పెద్ద ఎత్తున పట్టుబడ్డారు. అయితే వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Bollywood
Salman Khan
UP
Police

More Telugu News