న్యూ ఇయర్ లో మందుకొట్టి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్... వీడియో చూడండి!
- హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన మందుబాబులు
- మొత్తం 1200 మందిపై కేసులు నమోదు
- వాహనాలు స్వాధీనం, రేపు కౌన్సెలింగ్
ఆదివారం నాడు అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగగా, మొత్తం 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారందరి వాహనాలనూ సీజ్ చేశామని, వీరందరికీ మంగళవారం నాడు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. అధికంగా మద్యం సేవించినట్టు తేలిన కేసుల్లో శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు.