Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ ఇయర్ లో మందుకొట్టి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్... వీడియో చూడండి!

  • హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన మందుబాబులు
  • మొత్తం 1200 మందిపై కేసులు నమోదు
  • వాహనాలు స్వాధీనం, రేపు కౌన్సెలింగ్
2018 తొలి క్షణాలను పూటుగా మందుకొట్టి ఆస్వాదించాలని భావించిన వారికి పోలీసులు చుక్కలు చూపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 5 వేల మందికి పైగా పోలీసులు, వివిధ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో నిర్వహించిన తనిఖీల్లో ప్రముఖ టెలివిజన్ యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. జూబ్లీహిల్స్ లో జరిపి తనిఖీల్లో ప్రదీప్ అడ్డంగా బుక్కయ్యాడు.

ఆదివారం నాడు అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగగా, మొత్తం 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారందరి వాహనాలనూ సీజ్ చేశామని, వీరందరికీ మంగళవారం నాడు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. అధికంగా మద్యం సేవించినట్టు తేలిన కేసుల్లో శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు.
Drunken Drive
Hyderabad
New Year Party

More Telugu News