వైయస్ చనిపోయిన రోజే జగన్ పోలవరం టెండర్ల కోసం ప్రయత్నించారు: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
- పోలవరం కాంట్రాక్ట్ కోసం జగన్ యత్నించారు
- కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరలేదు
- ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు
ప్రాజెక్టులపై విమర్శించే నైతికత జగన్ కు లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 12,800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గ్రావిటీ ద్వారా పోలవరం నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని తెలిపారు. 2018 నాటికి 17 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామని చెప్పారు. జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు.