అందుకే మోహన్ బాబు నాతో మళ్లీ సినిమా చేయలేదేమో: దర్శకుడు వంశీ
- మోహన్ బాబుతో 'డిటెక్టివ్ నారద' చేశాను
- ఆయన ఎంతమాత్రం ఇబ్బంది పెట్టలేదు
- ఆ సినిమా సరిగ్గా ఆడలేదు
' నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం అని ఆయన మీకు అడ్వాన్స్ ఇచ్చారు .. కానీ చేయలేదు .. ఎందుకని?' అని వంశీ గారిని అడిగితే, " ఇక్కడ సక్సెస్ మాట్లాడుతుంది కదా .. మరేమో 'డిటెక్టివ్ నారద' ఆడలేదు. అందువలన ఆయన ఆ ఆలోచనను విరమించుకుని ఉండవచ్చు. ఆ తరువాత కూడా ఆయనను నేను కలుసు కోవడం జరిగింది .. ఆయన నన్నెంతో మర్యాద పూర్వకంగా చూశారు" అని చెప్పుకొచ్చారు.