అమెరికాలో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోకు టికెట్ ఫ్రీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోకు టికెట్ ఫ్రీ!

  • అమెరికాలో ఓ ఈవెంట్ కంపెనీ ఆఫర్
  • డిసెంబర్ 31 నైట్ పార్టీకి వెళితే ఉచిత టికెట్
  • పవన్ అభిమానుల్లో క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న సంస్థ
పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం ప్రీమియర్ షోకు ఉచితంగా టికెట్లిస్తారా? ఇదేదో గాసిప్ లేదా గాలి వార్త అనుకుంటున్నారా? కాదు... ఇది నిజం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాదు. అమెరికాలో మాత్రమే! పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తున్న ఈ చిత్రం 10వ తేదీన విడుదల కానుండగా, అందుకు ఒకరోజు ముందే అంటే జనవరి 9నే అమెరికాలో విడుదల కానుంది.

 ఇక ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజును దృష్టిలో ఉంచుకుని, ఓ ఈవెంట్ నిర్వాహకులు విభిన్నంగా ప్లాన్ చేసి ఉచిత టికెట్లను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 31 రాత్రి 'జల్సా 2018' పేరిట ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఈవెంట్ సంస్థ ఆ పార్టీ పాస్ లను కొనుగోలు చేసిన వారికి 'అజ్ఞాతవాసి' టికెట్లను ఫ్రీగా ఇస్తామని పబ్లిసిటీ చేస్తోంది. టెక్సాస్ లోని ఇర్వింగ్ లో బిజినెస్ స్టూడియూస్, 350, ఈ రాయల్ ఎల్ఎన్ #123 వద్ద ఈ పార్టీ రేపు రాత్రి 7 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటల వరకూ జరుగుతుంది. ఇందులో బ్యాచులర్, ఫ్యామిలీ సెక్షన్ ను విడివిడిగా ఏర్పాటు చేశారు. వీఐపీ డిన్నర్, డ్యాన్స్, ఫ్యాషన్ షో, బెలూన్ డ్రాప్ వంటి ఆకర్షణలూ ఉన్నాయి. ఓ ఫ్యామిలీకి 145 డాలర్లు వసూలు చేస్తున్నారు. అదీ 'అజ్ఞాతవాసి' ఉచిత టికెట్ సంగతి.
Pawan Kalyan
Agnatavasi
Amerika
Texas

More Telugu News