ఫేస్‌బుక్‌లో హిందూ దేవుళ్ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు.. యువకుడి అరెస్ట్‌!

  • హిందూ దేవుళ్ల‌పై కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ పోస్టులు 
  • నిందితుడిని ప‌ట్టుకున్న రాచకొండ సైబర్‌ సెల్ పోలీసులు
  • నిందితుడు ఎమ్మెస్సీ విద్యార్థిగా గుర్తింపు
విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలన్నా, మనసులో ఉన్న విషయాలను అందరికీ చాటి చెప్పాలన్నా ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. చివరకు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటనకి పాల్పడ్డ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడిని రాచకొండ సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

దేవుళ్లను కించపరుస్తూ ఆయన అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నాడని చెప్పారు. దేవుళ్లపై ఇటువంటి పోస్టులు చేస్తూ తమ మనోభావాలు దెబ్బ‌తీస్తున్నాడంటూ హిందువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. వినయ్ ఎమ్మెస్సీ విద్యార్థి అని చెప్పారు.
 
Go Back to Shorts
hindu
gods
facebook
student arrested

More Telugu News