ప‌ర్యావ‌ర‌ణవేత్త ఆఫ్రోజ్ షాకు అమితాబ్ బ‌హుమ‌తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌ర్యావ‌ర‌ణవేత్త ఆఫ్రోజ్ షాకు అమితాబ్ బ‌హుమ‌తి

  • ట్రాక్ట‌ర్‌, ఎక్సావేట‌ర్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన బిగ్‌బీ
  • బీచ్‌ను శుభ్రం చేసేందుకు వీలుగా ఎక్సావేట‌ర్‌
  • ట్వీట్ ద్వారా ఆనందం వ్య‌క్తం చేసిన అమితాబ్‌
ముంబై బీచ్‌లో చేరిన చెత్త‌ను శుభ్రం చేస్తూ ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న ప‌ర్యావ‌ర‌ణవేత్త ఆఫ్రోజ్ షాకి బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ బ‌హుమ‌తి ఇచ్చారు. బీచ్‌ని వేగంగా శుభ్రం చేసేందుకు వీలుగా ట్రాక్ట‌ర్‌, ఎక్సావేట‌ర్‌ను ఆయ‌న బ‌హుమ‌తిగా అంద‌జేశారు. స్వ‌చ్ఛత కోసం త‌న‌వంతు సాయం చేస్తూ అమితాబ్ నిజంగానే స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అనిపించుకున్నారు. ఆఫ్రోజ్‌కి ట్రాక్ట‌ర్ బ‌హుమ‌తి ఇచ్చిన ఫొటోల‌ను అమితాబ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఓ మంచి పని కోసం బహుమతి ఇచ్చానని ఆనందం వ్యక్తం చేశారు. `ముంబయిలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేయడానికి ట్రాక్టర్‌, ఎక్సావేటర్‌ను కానుకగా ఇచ్చాను. ఈ పని చాలా సంతృప్తిగా అనిపించింది` అని అమితాబ్ ట్వీటారు. అమితాబ్ ట్వీట్‌కి ఆఫ్రోజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. బిగ్‌బి తమతో చేయి కలిపినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
environment
afroz shah
Amitabh Bachchan
gift

More Telugu News