లైవ్ ఛాట్ లో రేవంత్ రెడ్డిని తేలికగా తీసిపారేసిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైవ్ ఛాట్ లో రేవంత్ రెడ్డిని తేలికగా తీసిపారేసిన కేటీఆర్!

  • ప్రతి రంగంలో చీప్ క్యారెక్టర్స్ ఉంటాయి
  • అలాంటి వారిని వదిలేయడమే బెస్ట్
  • విజ్ఞత కలిగిన వారు పొరపాట్ల నుంచి నేర్చుకుంటారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించారు. దాదాపు రెండు గంటల పాటు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. వ్యక్తిగత విషయాలతో పాటు హాబీలు, వంటకాలు, ఆటలు, రాజకీయాలు.. ఇలా పలు అంశాలపై కేటీఆర్ స్పందించారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్... "అన్నా, రేవంత్ రెడ్డిపై ఓ లుక్ వేయండి. రోజురోజుకూ అతని మాటలు శ్రుతి మించుతున్నాయ్. అతనికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వండి" అంటూ కేటీఆర్ ను కోరారు. దీనికి సమాధానంగా... "ప్రతి రంగంలో చీప్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటివారిని వదిలేయడమే మంచిది" అంటూ కేటీఆర్ అన్నారు.

మరో నెటిజన్ కేటీఆర్ కు ఆసక్తికర అంశాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా? అంటూ సదరు నెటిజన్ కామెంట్ చేశారు. కేటీఆర్ దీనికి సమాధానమిస్తూ, "ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు. విజ్ఞత కలిగిన వారు వాటి నుంచి నేర్చుకుంటారు. నేర్చుకోలేని వారు అలాగే మిగిలిపోతారు" అని అన్నారు.  
KTR
Revanth Reddy
KCR

More Telugu News