'ఒక్క క్షణం' దర్శకుడి వైపు మొగ్గు చూపుతోన్న బన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఒక్క క్షణం' దర్శకుడి వైపు మొగ్గు చూపుతోన్న బన్నీ

  • 'ఒక్క క్షణం' మూవీకి మంచి రెస్పాన్స్ 
  • వి.ఐ.ఆనంద్ పై బన్నీ దృష్టి
  • ఈ కాంబినేషన్ ఓకే అయ్యే ఛాన్స్  
కొత్తదనంతో ఆడియన్స్ ను మెప్పించే దర్శకులతో వెంటనే సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు వి.ఐ.ఆనంద్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సూపర్ హిట్ కావడం, 'ఒక్క క్షణం' సినిమా షూటింగ్ సమయంలో ఆనంద్ గురించి శిరీష్ .. అల్లు అర్జున్ కి గొప్పగా చెప్పడం జరిగింది.

 దాంతో ఆనంద్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా థియేటర్స్ కి వచ్చిన 'ఒక్క క్షణం' మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను యూత్ బాగా ఆదరిస్తోంది. అందువలన ఆనంద్ దర్శకత్వంలో బన్నీ చేయడం దాదాపు ఖాయమైపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్లోని ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.   
Allu Arjun
anand

More Telugu News