షోయబ్ అక్తర్ ఫొటోకు యువరాజ్ వ్యంగ్యంగా ట్వీట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షోయబ్ అక్తర్ ఫొటోకు యువరాజ్ వ్యంగ్యంగా ట్వీట్!

  • యువతలో ప్రేరణ నింపే కోట్స్ ట్వీట్ చేసిన అక్తర్
  • కళ్లకు అద్దాలు, చేతిలో హెల్మెట్‌తో కనిపించిన మాజీ క్రికెటర్
  • వెల్డింగ్‌కు వెళ్తున్నావా? అంటూ యూవీ ట్వీట్
పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేసిన ఫొటోకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అయింది. యువతలో ప్రేరణ రగిల్చేలా అక్తర్ తన ఫొటోతో కొటేషన్స్‌ను పోస్ట్ చేశాడు. ‘‘మీ లక్ష్యాల విషయంలో భయపడొద్దు. శ్రమకు ఎప్పుడూ ఫుల్‌స్టాప్ పెట్టొద్దు. మీ లక్ష్యాల విషయంలోనూ అంతే’’ అంటూ కళ్లద్దాలు పెట్టుకుని, చేతిలో హెల్మెట్ ఉన్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఈ ట్వీట్‌ను చూసిన యూవీ స్పందిస్తూ.. ‘‘నువ్వు చెప్పింది బాగుంది కానీ.. వెల్డింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నావ్?’’ అంటూ రీట్వీట్ చేశాడు. అక్తర్ వేషధారణ అలా ఉండడంతో యూవీ ఇలా సరదాగా స్పందించాడు. యూవీ ట్వీట్ చేసిన కాసేపటికే ఇది వైరల్ అయింది.
Shoaib Akhta
yuvraj singh
Twitter

More Telugu News