రియాద్‌లో గుండెపోటుతో మరణించిన తెలంగాణ వాసి.. మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తుండగా ప్రమాదంలో స్నేహితుడు మృతి!
- 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రియాద్ వెళ్లిన స్నేహితులు
- గుండెపోటుతో ఒకరు, రోడ్డు ప్రమాదంలో మరొకరు ఒకే రోజు మృతి
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
దీంతో అతడి మృతదేహాన్ని స్వగ్రామమైన మెట్‌పల్లికి తరలించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన యూసుఫ్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. స్నేహితులిద్దరూ ఒకే రోజు మరణించిన విషయం తెలిసి మెట్పల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.