శంషాబాద్ సమీపంలో మహిళ కిడ్నాప్ నకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ సమీపంలో మహిళ కిడ్నాప్ నకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం!

  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ
  • వేరే మార్గంలో వాహనాన్ని తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్
  • మహిళ అరుపులు విని స్పందించిన ఓ వాహనదారుడు
  • పోలీసులకు నిందితుడి అప్పగింత
ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ యత్నించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. లండన్ వెళుతున్న ఓ మహిళ హైదరాబాదు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వాహనం ప్రయాణిస్తుండటాన్ని గమనించిన ఆమె, కారును ఆపమని కోరింది.

ఆమె మాటలు పట్టించుకోని క్యాబ్ డ్రైవర్ అదే మార్గంలో వెళుతూ వాహనాలను ఢీకొట్టుకుంటూ ఓ తోటలోకి దూసుకెళ్లాడు. మహిళ అరుపులు విన్న ఓ వాహనదారుడు కారును వెంబడించాడు. స్థానికుల సాయంతో క్యాబ్ డ్రైవర్ ని పట్టుకుని మాదన్నపేట పోలీసులకు అప్పగించాడు.
Hyderabad
shamshabad

More Telugu News