అసదుద్దీన్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేసిన ముస్లిం మ‌హిళ‌లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసదుద్దీన్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేసిన ముస్లిం మ‌హిళ‌లు!

  • త్రిపుల్ తలాక్ బిల్లుపై ఓవైసీ వ్యాఖ్య‌ల‌పై వార‌ణాసిలో నిర‌స‌న‌
  • మోదీ, యోగికి అనుకూలంగా నినాదాలు
  • త్రిపుల్ త‌లాక్ బిల్లుపై ముస్లిం మ‌హిళ‌ల‌ హ‌ర్షం
ముస్లిం మ‌హిళ జీవితాల‌ను రోడ్డుపై ప‌డేస్తోన్న త్రిపుల్ త‌లాక్‌ను ర‌ద్దు చేసే విష‌యంపై ఈ రోజు లోక్‌స‌భ‌లో బిల్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్ ప్ర‌కారం తలాక్ చెప్పేవారిని నేరస్తులుగా పరిగణిస్తారు. అయితే, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ నేపథ్యంలో అస‌దుద్దీన్ వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని వార‌ణాసి ముస్లిం మ‌హిళ‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. రోడ్డుపై అస‌దుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మ‌ను త‌గుల‌బెట్టారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. త్రిపుల్ తలాక్ చెప్పిన వారిని నేర‌స్తులుగా ప‌రిగ‌ణిస్తూ జైలు శిక్ష వేయాల‌ని సూచిస్తోన్న ఆ బిల్లును స‌మ‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు.
triple talaq
Uttar Pradesh
asaduddin owaisi

More Telugu News