అసదుద్దీన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన ముస్లిం మహిళలు!
- త్రిపుల్ తలాక్ బిల్లుపై ఓవైసీ వ్యాఖ్యలపై వారణాసిలో నిరసన
- మోదీ, యోగికి అనుకూలంగా నినాదాలు
- త్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లిం మహిళల హర్షం
ఈ నేపథ్యంలో అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ముస్లిం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. త్రిపుల్ తలాక్ చెప్పిన వారిని నేరస్తులుగా పరిగణిస్తూ జైలు శిక్ష వేయాలని సూచిస్తోన్న ఆ బిల్లును సమర్థిస్తున్నట్లు తెలిపారు.